24 July, 2026 | 3:26 AM

డ్రగ్స్ సమాచారం పోలీసులకు ఇవ్వండి

24-07-2026 12:00 AM

ఎమ్మెల్యే మల్‌రెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి

ఇబ్రహీంపట్నం (జూలై 23): ఆదిబట్ల సర్కిల్ బొంగులూరు ఎక్స్ రోడ్డులోని ప్రమీద గార్డెన్లో మల్రెడ్డి అభిషేక్ రెడ్డి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ’యువజన చైతన్య వేదిక’ ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి,డిసిపి నారాయణ రెడ్డి లు మాట్లాడు తూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, నియోజకవర్గంలో డ్రగ్స్కు సం బంధించిన ఏ సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని కోరారు.

అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువు, ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని, యువత పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం నాడు యువ త కోసం ఇలాంటి సామాజిక చైతన్య కార్యక్రమం జరుపుకోవడం ఆనందంగా ఉంద న్నారు. కార్యక్రమంలో విద్యార్థులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేక్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.