4 May, 2026 | 3:18 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

07-03-2026 02:05 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించి, రోగులకు సమయానికి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

ఆసుపత్రుల్లో పరిశుభ్రత, మందుల లభ్యత, వైద్యుల హాజరు వంటి అంశాలపై అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కలెక్టర్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా చీపురు పట్టి చెత్తను శుభ్రం చేశారు.