బాబు బడికి పోలేదా...? విద్యార్థిని పలకరించిన కలెక్టర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ కె. హరిత దాహేగాం మండల పర్యటనలో భాగంగా మార్గమధ్యంలో ఐనం గ్రామం వద్ద ఓ బాలుడు రోడ్డుపై కనిపించడంతో తన వాహనాన్ని ఆపి అతనిని ఆప్యాయంగా పలకరించారు. “బాబు బడికి వెళ్తున్నావా?” అని కలెక్టర్ ప్రశ్నించగా, ఆ బాలుడు బడికి వెళ్లడం లేదని తెలిపాడు.
“ఎందుకు ఈరోజు బడికి వెళ్లలేదు?” అని కలెక్టర్ అడగగా, తన ఒంటిపై దురద సమస్య ఉండటంతోనే పాఠశాలకు వెళ్లలేదని బాలుడు చెప్పాడు.దీనిపై స్పందించిన కలెక్టర్ కె. హరిత విద్యార్థి ఆరోగ్యం గురించి తెలుసుకొని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ చదువుపై దృష్టి పెట్టాలని, విద్యతోనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు.కలెక్టర్ చూపిన ఆప్యాయతతో బాలుడు ఆనందం వ్యక్తం చేశాడు.




