కొత్తగూడెం 17వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ ఏర్పాటు
కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ టీ పి పి సి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పాత కమిటీ లను రద్దు చేసి నూతన కమిటీ లను ఏర్పాటు చేయాలనే ఆదేశాల మేరకు కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలలో భాగంగా కొత్తగూడెం కార్పొరేషన్ లో గల రామవరం 17వ డివిజిన్ లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి అధ్యక్షతన నూతన కమిటీ నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ లో 17వ డివిజిన్ అధ్యక్షుడు గా దాట్ల సందీప్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
గౌరవ అధ్యక్షుడు గా దొమ్మటి నాగేశ్వరరావు గారు,ఉపాధ్యక్షులుగా దాట్ల శ్రావణ్ కుమార్, బత్తిని రాజశేఖర్, మహిళ అధ్యక్షురాలుగా కుమ్మరి నిర్మల, యూత్ అధ్యక్షులుగా నిమ్మల రంజిత్, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండి రహీం, కార్యదర్శులుగా దొమ్మటి రవికాంత్, కల్యాణ్, సాయి, ఎల్లప్ప ఇంకా ఎనిమిది మంది కార్యవర్గ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం నూతన అధ్యక్షుడు దాట్ల సందీప్ కుమార్ మాట్లాడుతూ, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారథ్యం లో, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజల సమస్యల కోసమ అనుక్షణం పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేస్తానని ,తనని అధ్యక్షుడిగా ఎన్నుకున్న కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు.






