7 August, 2026 | 7:39 PM

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన

07-08-2026 06:20 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను, పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ డీఏలను వెంటనే మంజూరు చేయాలని, విద్యాశాఖలో పర్యవేక్షణ పోస్టులను  భర్తీ చేయాలని, రేషనలైజేషన్ జీవో 25 సవరించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్ పీసీ ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నాలుగు దశల ఉద్యమ కార్యక్రమాల్లో భాగంగా,శుక్రవారం నాడు సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల  మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచెర్లలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.