16 March, 2026 | 8:22 PM

కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన

16-03-2026 06:10 PM

నిర్మల్(విజయక్రాంతి): సర్వ శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కేజీబీవీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  యు టి ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట కరపత్రాలతో నిరసన తెలిపి సంఘ బదులు శంకర్ అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం కేజీబీవీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నిలబెడ్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.