18 March, 2026 | 11:40 AM

Breaking News

మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •   తప్పుతై తప్పకుండా ప్రశ్నిస్తాం!   •  

రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళన

18-03-2026 12:00 AM

హనుమకొండ, మార్చి 17 (విజయ క్రాంతి): కాజీపేట (అయోధ్య పురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని కేయూ జేఏసీ అధ్యక్షులు డి.తిరుపతి డిమాండ్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేయూ  లైబ్రరీ వద్ద జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని  నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా పోరాటాలు నిర్వహించారని, కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి భూ సేకరణ చేసిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ద్వారా భూములు కోల్పోయిన 114 మంది అయోధ్య పురం గ్రామ రైతుల పేర్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినా, రెండుసార్లు కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన సంబంధిత కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేసిన ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించకుండా వారికి ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ప్రభుత్వం మోసం చేయాలని చూస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల పేర్లు పంపించడమే కాకుండా వారికి ఉద్యోగాలు ఇప్పించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అలాగే కోచ్ ఫ్యాక్టరీలోకి వేరే రాష్ట్రాల నుండి ఉద్యోగులను దిగుమతి చేసుకోకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్థానిక నిరుద్యోగ యువకులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. రైల్వేలో అప్రెంటిస్ చేసిన నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని జీవోను విడుదల చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించకుండా వేరే రాష్ట్రాలలో ఇచ్చిన విధంగానే ఈ ప్రాంత వాసులకు, భూములు కోల్పోయిన అయోధ్య పురం రైతులకు, అప్రెంటిస్ చేసిన యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన కాజీపేట రైల్వేను డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఏ  రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్ గౌడ్, పీ డి ఎస్ యు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్ నాయకులు రాజు, శ్రీకాంత్ , అనిల్, రాజేష్ పాల్గొన్నారు.