లండన్‌లో సీజేఐ ప్రసంగంపై నిరసన
- ప్రశ్నలు, భారత్‌లో భావప్రకటన స్వేచ్ఛ లేదని ఆరోపణలు
- భారత్ రాయబార కార్యాలయం ఆగ్రహం
లండన్, జూన్ 6 (విజయక్రాంతి): లండన్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రసంగాన్ని కొంతమంది అడ్డుకున్నారు. దీనిపై భారత్ రాయబార కార్యాలయం ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఈ ఘటన ఈ నెల 4వ తేదీన జరగగా, శనివారం వెలుగులోకి వచ్చింది. లండన్‌లోని బీఆర్‌కే కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నేషనల్ లా అన్న అంశంపై ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
మర్యాదపూర్వకంగా జరగాల్సిన ఈవెంట్లో ప్రేక్షకుల ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, అసమర్థనీయంగా ఉన్నట్లు తన ప్రకటనలో హైకమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీజేఐ ప్రసంగిస్తుండగా కొందరు ప్రశ్నలు సంధిస్తూ, మరికొందరు భారత్‌లో భావప్రకటన స్వేచ్ఛ లేదని ఆరోపించారు. నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడాన్ని ఖండించారు. సభ నిర్వాహకు లు సంబంధంలేని ప్రశ్నలు అడగవద్దని చెప్పా రు. అయినా వెనక్కు తగ్గలేదు. సీజేఐ నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని పూర్తి చేసి వెనుదిరిగారు.






