27 July, 2026 | 1:10 AM

మున్సిపల్ అభివృద్ధికి నిరంతరం కృషి

27-07-2026 12:19 AM

చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్

శంకర్‌పల్లి : జూలై 26 ( విజయ క్రాంతి): మున్సిపల్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పుర చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్ పల్లి 6వ వార్డులు రూ. 5 లక్షల నిధులతో చేపట్టిన అండర్ డ్రైనేజ్ ప నులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య సహకారంతో మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వార్డులలో సీసీ రోడ్లు,

అండర్ డ్రైనేజ్ పనులకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరుగుతుందని అన్నారు. ప్రజ లు కూడా పారిశుధ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. వార్డులలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉషారాణి విజయ్ కుమార్, మాజీ వైస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, నాయకులు పాండురంగ రెడ్డి, రవీందర్ రెడ్డి, భాస్కర్, నరసింహులు, కృష్ణ  పాల్గొన్నారు.