11 March, 2026 | 11:49 AM

లో లెవెల్ బ్రిడ్జీ మరమతుకు ప్రతిపాదనలు

11-03-2026 12:34 AM

సిద్దిపేట రూరల్, మార్చి ౧౦: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట, గుర్రాలగొంది గ్రామాల మధ్యగల లో లెవెల్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఇటీవల విజయక్రాంతి ప్రమాదపు అంచున ప్రయాణం అనే శీర్షిక ప్రచూరించింది. దాంతో సిద్దిపేట పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటాచారి మంగళవారం బ్రిడ్జిని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆయన విజయక్రాంతి తో మాట్లాడుతూ రెండు గ్రామాల మధ్య గల రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్న ది వాస్తవమని, రోడ్డు మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి ఉన్నత అధికారులకు ని వేదిస్తామన్నారు. సమస్యని తమ దృష్టికి తీసుకువచ్చిన విజయక్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు.