ఎరువుల విక్రయాలపై తనిఖీలు
11-03-2026 12:33 AM
వెల్దుర్తి, మార్చ్ 10: వెల్దుర్తి మండలంలోని రైతులకు యూరి యా, ఎరువులు కొరత లేకుండా అందిస్తున్నామని వ్యవసాయ అ ధికారి ఝాన్సీ తెలిపారు. మంగళవారం తహసీల్దార్ శ్రీనివాస్తో కలి సి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న ఎరువుల నిల్వ లు, విక్రయ రికార్డులను పరిశీలించారు. ఇప్పటివరకు ఉమ్మడి మండల పరిధిలో సుమారు 16, 800 యూరియా బస్తాలు రైతులకు సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు.యూరియాను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు గట్టిగా హెచ్చరించారు.




