20 May, 2026 | 3:47 AM

స్థలం సాకుతో కేంద్రీయ విద్యాలయం తరలించే ఆలోచన

20-05-2026 12:00 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల, మే 19 (విజయక్రాంతి): స్థలం సాకుతో కేంద్రీయ విద్యాలయం తరలించే ఆలోచన సమంజసం కాదని,జగి త్యాల ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎంపీ అరవింద్ మాటలు ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఫెడరల్ స్ఫూర్తిలో భాగంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు కోరడంలో తప్పేముందని నిధులు కోరితే ము ఖ్యమంత్రి ని బిచ్చగాడు అని అంటారా  ఇ లాంటి వాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా అన్నారు.

5 ఎండ్లలో తెలంగాణ రాష్ట్రం జి ఎస్ టి రూపం లో కేంద్రానికి 2 లక్షల కోట్ల పైగా ఇస్తే కేంద్రం మాత్రం 85 వేల కోట్ల నిధులు ఇచ్చిందని,కేంద్రీయ విద్యాలయం ఏర్పాటులో ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎంపీకి బాధ్యత ఉంటుందన్నారు.ఇరిగేషన్ శాఖ మంత్రిని కేంద్రీయ విద్యాలయం స్థలం విషయంలో కలవాల్సిన బాధ్యత ఎంపీ కి ఉంది.

నేను అనేక సార్లు కలిసి 5 ఎకరాలు కేటాయించాలి అని వినతి పత్రాన్ని అందజేశా. కేంద్రీయ విద్యాలయం స్థలం సేకరణ లో ఎమ్మెల్యే అసమర్థ అంటే... నేను జగిత్యాల నియోజవర్గానికి అవసరమైన జాతీయ రహదారులు,బ్లాక్ స్పాట్ రోడ్డులు, వంతెనలు, జగన్నాద్ పూర్ బ్రిడ్జి నిధులు మంజూరు చేయాలని ఎంపీ అరవింద్ కి, కేంద్ర మంత్రులకు వినతులు ఇస్తే ఇప్పటి సమాధానం లే దు ఇది అసమర్థత కాదా.చల్గల్ లో కేంద్రీ య విద్యాలయం ఏర్పాటుకు చిత్తశుద్ధితో ఉన్నా... వాలంతరి అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ...సంస్థ అభివ్రుద్ది పై ఎప్పుడైనా ఆలోచన చేశారా.టి ర్ నగర్ టీచర్స్ కాలని దగ్గర జాతీయ రహదారి కి 200 మీటర్ల దూరం లో 6 ఎకరాల స్థలం సిద్ధంగా ఉంది.

జగిత్యాల నియోజకవర్గంపై కనీస అవగాహన లేదు అహంకారంతో మాట్లాడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్ తో రాజకీయం వద్దు జగిత్యాల నియోజకవర్గంలో అన్ని ఆలయాలకు నిధులు కేటాయించాను. కుల మత రాజకీయాలు నాకు అలవాటు లేదు.నేడు రాష్ట్ర ములో అతిపెద్ద సమస్య వడ్లు మక్కల కొ నుగోలు ఎఫ్ సి ఐ ధాన్యం సేకరణ లో జా ప్యం వల్లనే రైతులకు కష్టాలు. టీడీపీ బీజేపీ అనుబంధంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో కేం ద్రం మక్కలు కొనట్లేదు. గడిచిన 6 నెలల్లో ఎ ఫ్ సి ఐ ద్వారా ఎంత ధాన్యం సేకరణ చేశా రో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్,పిసిసి సెక్రటరీ బండ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు నాగభూషణం, గోలి శ్రీనివాస్,మాజీ ఏఎం సీ చైర్మన్ కొలుగోరి దామోదర్ రావు, నక్క ల రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కొత్త మో హన్,సీనియర్ నాయకులు గట్టు సతీష్, ము జీబ్ బాషా,అడువల లక్ష్మణ్, బాల ముకుం దం, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీరం రాజేష్, మహిళ కౌన్సిలర్ లు పంబాల సుజాత రాము,తదితరులుపాల్గొన్నారు.