20 May, 2026 | 4:52 AM

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

20-05-2026 12:00 AM

సంస్థాన్ నారాయణపూర్, మే 19 : మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు గ్రామానికి చెందిన బీజేపీ, సిపిఎం , బీసీ సంక్షేమ సంఘం నాయకులు మజ్జిగ ప్యాకెట్లు,అరటి పండ్లు పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లిన నాయకులు, పని ప్రదేశంలో టెంట్లు మరియు మంచినీటి వసతి కల్పించాలని కోరారు. 

 బీజేపీ పార్టీ మండల కార్యదర్శి కోడూరు బీరయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నర్సింహ కురుమ,వార్డు సభ్యుడు రొమ్ముల సత్తయ్య, సీపీఎం రైతు సంఘం మండల అధ్యక్షులు  కొమ్ము మల్లేశ్,పంచాయతీ సెక్రటరీ సంతోష, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్ కోడూరు రాములు, తదితరులు పాల్గొన్నారు.