10 August, 2026 | 8:48 PM

Breaking News

పోలీస్ శాఖలు పదోన్నతులు

10-08-2026 07:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖలో పదోన్నతులు పొందిన ఉద్యోగులను జిల్లా ఎస్పీ జానకి షర్మిల సోమవారం అభినందించారు. 1990 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ASI)లుగా పదోన్నతి లభించినట్టు తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో చంద్రప్రకాష్ ఎస్.చంద్రశేఖర్ సాయన్న ఉన్నారు. వారిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీనివాస్ ఉన్నారు.