10 August, 2026 | 9:43 PM

కుంటుపడిన గూడెం అభివృద్ధిని గాడిలో పెట్టింది సిపిఐనే

10-08-2026 08:15 PM

క్రమబద్దీకరణ జీవో 76ను బుట్టదాఖలు చేస్తే ఊరుకొం

కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిసంచాలి

పాలకుల ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా

చుంచుపల్లి,(విజయక్రాంతి): కుంటుపడిన కొత్తగూడెం ప్రాంత అభివృద్ధిని గాడిలో పెట్టింది ఒక్క సిపిఐ మాత్రమేనని, నియోజకవర్గ అభివృధ్ధికోసం స్థానిక ఎమ్మెల్యే కూనంనేని చేస్తున్న కృషికి ప్రభుత్వం సహరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా స్పష్టం చేశారు. సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఐదో రోజైన సోమవారం కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి కార్మికప్రాంతాల్లో కొనసాగింది.

ఆటా-పాటలతో అత్యంత ఉత్సాహంగా సాగిన ఈ యాత్రలో భాగంగా రైల్వే స్టేషన్ సెంటర్, ఎంజి రోడ్డు, సూర్య పాలస్ రోడ్, సింగరేణి హెడ్డాఫీస్, ఎసిబి నగర్, రామవరం, 3 ఇంక్లైన్, 4 ఇంక్లైన్, రుద్రంపూర్, గౌతంపూర్, పెనగడప సెంటర్లలో జరిగిన సభల్లో యాత్ర రథసారథి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా ప్రసంగించారు. ప్రభుత్వం జారీ  చేసిన  క్రమబద్దీకరణ జీవో 76ను బుట్టదాఖలు చేస్తే ఊరుకునేది లేదని, పట్టాల జారీ ప్రక్రియ ఏమైందో పాలకులు సమాధానం చెప్పాలని నిలదీశారు.

దశాబ్దాలుగా నివాసముంటున్న రామవరం, సింగరేణి ప్రాంత ప్రజలకు తక్షణమే పొజేషన్ సర్టిఫికెట్లు జారీ యాజమాన్యపు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషితో సాగుతున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి సహకరించాలని కోరారు. సీఎస్ఆర్ నిధులతో సింగరేణి ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు, యువజన, విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, జెన్జి ఉద్యమం ద్వారానైనా కేంద్రం వుద్ది తెచ్చుకోవాలని, తీరు మార్చుకోని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.