10 August, 2026 | 9:29 PM

దేశభక్తితో హర్ ఘర్ తిరంగా

10-08-2026 08:19 PM

నంగునూరు,(విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నంగునూరు మండల కేంద్రంలో సోమవారం హర్ ఘర్ తిరంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, నాయకులు తమ నివాసాలపై జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. కుల, మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరిలో మొదట మనం భారతీయులం అనే భావన బలపడాలని, యువతలో దేశం పట్ల బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి  మండల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజినికర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పరకాల తిరుపతి రెడ్డి, గంధం పరమేశ్వర రెడ్డి, యాదగిరి, గోటూరి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.