డీసీసీబీలో పదోన్నతుల లొల్లి
- ఆలస్యంగా వెలుగులోకి.. సరిచేసే అవకాశం ఉందా?
- పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం
మహబూబ్ నగర్, మార్చి 18 (విజయ క్రాంతి ) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో గత సంవత్సరం ఆగస్టు ఒకటిన ఉద్యగుల ప దోన్నతుల ప్రక్రియ జరిగింది. అందులో భాగంగా వివిధ స్థాయిలలోని ఆరుగురు ఉద్యోగులు పదోన్నతులు పొందారు. అయితే ఈ ప్రక్రియలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది.
కమిటీ నిర్ణయం సది అయిందా?
బ్యాంకు అధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వానాధికారి, బ్యాంకింగ్ కు చెందిన వృత్తి నిపుణు డైన డైరెక్టర్, రాష్ట్ర సహకార బ్యాంకు చే నామినేట్ చేయబడిన ఉన్నంతధికారి తో కూడిన ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ నిర్వహిం చి, ఇంటర్వ్యూ మార్కులు, సీనియారిటీ, ఉ ద్యోగి వార్షిక పనితీరుకు కేటాయించిన మా ర్కులను కలిపి అత్యధిక మార్కులు పొందిన వారికీ పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది.
మరో రెండువారాల్లో అధ్యక్షుని పదవీ కా లం ముగుస్తుండగా ఆధారబాదరగా పదోన్నతులు చేపట్టాల్సిన అవసరమేమిటో చెప్పాల్సిన బాధ్యత ఉన్నంతధికారులపైన ఉన్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత మార్చ్ నెలలోనే ప్రమోషన్ల ప్రక్రియ ఒకసారి జరిగినట్లు తెలుస్తుంది. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రతి సంవత్స రం ఉన్నంతధికారులు ప్రతి ఉద్యోగి పనితీరును పరిశీలించి గ్రేడింగులు ఇచ్చిఉద్యోగు లకు తెలియజేయాలి.
ఉద్యోగులనుంటి అ భ్యంతరాలను స్వీకారయించి తిరిగి పరిశీలన చెయాలి. ఉద్యోగుల పనితీరుకు కూడా పదోన్నతులకు కొన్ని మార్కులు కేటాయించబ డినందున ఈ ప్రక్రియకు ఎంతో ప్రాముఖ్య త ఉన్నా ఉన్నంతదికారులు ఈ ప్రక్రియ చేపట్టకపోవడం వలన పారదర్శకత లోపించి పదోన్నతులలో తమకు అన్యాయం జరిగిందని ఉద్యోగులు భావిస్తున్నారు.
మెరిట్ కోటా... పాటించారా?
మెరిట్ కోటాలో ఇవ్వాల్సిన పదోన్నతుల ను కూడా సీనియారిటీ కోటాకు మల్లించి అ మ్ముకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నాబార్డు వారి తనిఖీ నీవేదికలో పై అక్రమాలను ప్రస్థావించి ప్రమోషన్లను అడ్డుచేయా లని సూచించినట్టు విశ్వసనీయ సమాచా రం. ప్రమోషన్లలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఉన్నతఅధికారులు నమ్మబలుకు తున్నారు.
అందుకు ముఖ్య కారణం పదోన్నతులు పొందిన అరుగురిలో ముగ్గురు ఉ న్నంతదికారులు ఉండ డమేనని ఉన్నట్టు తె లుస్తుంది. నియమ నిబంధనలకు దూరంగా ఉండిన వారిపై పూర్తిస్థాయిలో విచారణ చే సి అర్హులైన వారికి పద్ధతులు ఇవ్వాల్సిన అ వసరం ఎంతైనా ఉందని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటే పదోన్నతులకు దూరం అయిన ఉద్యోగులకు మేలు జరిగే అవకాశాలు మెట్టుగా ఉన్నాయి.




