24 July, 2026 | 9:22 PM

Breaking News

గరిడేపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు విస్తృత తనిఖీలు   •   విజ్ఞానవంతులు ప్రశ్నిస్తే దేశద్రోహులా   •   స్టెమ్‌స్పార్క్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు   •   నీట్ పేపర్ లీకేజీపై ప్రభుత్వానిదే బాధ్యత   •   నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి   •   ఖానాపూర్ పట్టణంలో స్వర్ణకార సంఘం కార్యవర్గం ఏర్పాటు   •   వైభవంగా శ్రీజగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం   •   కల్లూరులో పాఠశాలలు బంద్ విజయవంతం   •   దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు   •   ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సన్మానించిన మున్సిపల్ చైర్మన్   •  

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

24-07-2026 08:16 PM

- ప్రొఫెసర్ కోదండరాంకు వినతి

ఆలేరు, జులై 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పింఛన్, హెల్త్ కార్డు, ప్రత్యేక గుర్తింపు కార్డు, స్వాతంత్ర సమరయోధుల గుర్తింపు ఇవ్వాలని సీస మహేశ్వరి ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా హామీలు అమలు కాలేదని, జైలుకు వెళ్లి, లాఠీ దెబ్బలు తిని, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహిళలు, గృహిణులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కసాగాల అనసూయ, అరుణ తదితరులు పాల్గొన్నారు.