18 April, 2026 | 7:50 AM

30 లక్షల టన్నులను సేకరించండి

18-04-2026 12:00 AM
  1. 5 శాతం నూకతో బాయిల్డ్ రైస్ సరఫరాకు సిద్ధం

పాతబకాయిలు రూ.1,468.94 కోట్లు విడుదల చేయండి

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్‌రెడ్డి,మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వినతి

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల (ఎల్‌ఎంటీ) బాయి ల్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యాసంగి పంట బాయిల్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని వారు కేంద్ర మం త్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సర ఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు.

ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుం దని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు.

తెలంగాణలో పండే యాసంగి ధాన్యం బా యిల్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ నేప థ్యంలో యాసంగి పంటకు సంబంధించి మొ త్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధం గా ఉన్నామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆమోదం తెలిపారు.

2014 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంట నే విడుదల చేయాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరిధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు పోషకాహార బియ్యాన్ని (ఎఫ్‌ఆర్‌కే) పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్‌ల పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునః ప్రారంభిం చాలని కేంద్ర మంత్రి ప్రహ్లద్‌జోషికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజాపం పిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.