22 May, 2026 | 6:57 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవు   •   నెల గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయలేని ప్రభుత్వం   •   క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత మనోధైర్యం   •   మెడికల్ కాలేజీకి అమ్మ శరీరం దానం   •   మరోసారి ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్‌గా బోడ స్వామి   •   తుర్రవారిగూడెం గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతి   •   సాగుభూములు కోల్పోయి ఆదివాసి మహిళల ఆవేదన.. తహసీల్దార్‌కు వినతి   •   ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఒకరు మృతి   •   ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుర్మే మహేందర్ నియామకం   •   న్యాయం కోసం జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ముందు వృద్ధుడి నిరసన   •  

ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను పరిష్కరించాలి

17-11-2025 12:41 AM

ములకలపల్లి, నవంబర్ 16,(విజయక్రాంతి):ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యా ర్దులకు మోను ప్రకారం భోజనం పెట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు ముదిగొండ ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ములకలపల్లి లోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సం దర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తె లుసుకొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ ను ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.

హాస్టల్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చెపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రభుత్వ వసతి గృహాలను అభివృద్ధి పరచాలని హా స్టల్ వార్డెన్లు నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు సంజయ్,రాము,సాగర్,సాయి,వినిత్, తదితరులు పాల్గొన్నారు.