ఖైదీల వ్యవసాయ కాలనీ యూనిట్ ప్రారంభం
కుషాయిగూడ, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఖైదీల సంక్షేమం, పునరావాసం మరియు నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా చెర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ (పీఏసీ)లో ఆయుర్వేద గ్రామం, కోల్ ప్రెస్ ఆయిల్ యూని ట్ను ప్రారంభించారు. కార్యక్రమాన్ని డా. సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఆరు సంవత్సరాల విరామం అనంతరం పీఏసీలో ఆయుర్వేద గ్రామాన్ని పునఃప్రారంభించారు. జైలు శాఖ ఆధ్వర్యంలో ఇది రెండో ఆయుర్వేద గ్రామం. మొదటిది సికాలో ప్రారంభ మై విజయవంతంగా కొనసాగుతోంది.
జైలు పరిశ్రమల చరిత్రలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కోల్ ప్రెస్ ఆయిల్ యూనిట్ కూడా ఇదే సందర్భంలో ప్రారంభమైంది. ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విడుదల అనంతరం స్వయం ఉపాధికి దారి చూపడం ఈ యూనిట్ లక్ష్యం. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఆయుర్వేద గ్రామం తక్కువ ఖర్చు తో నాణ్యమైన వైద్యం అందించే మోడల్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని తెలిపారు.
అసలైన ఆయుర్వేద చికిత్సలు, థెరపీలు నామమాత్రపు చార్జీలతో అందుబాటులో ఉంటాయ ని చెప్పారు. కార్యక్రమంలో డీఐజీ హైదరాబాద్ రేంజ్ డా. డి. శ్రీనివాస్, డీఐజీ వరం గల్ రేంజ్ ఎం. సంపత్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్.ఎం. ఖాలిద్ అక్తర్, పీ ఏసీ చెర్లపల్లి సూపరింటెండెంట్ డి. భారత్, సీపీ చెర్లపల్లి సూపరింటెండెంట్ జి. ప్రమో ద్, ఆయుర్వేద వైద్యులు డా. వై.బి. రమేష్, డా. ఎం. గౌతమ్, డీఎస్ జైల్స్ డి. కాలిదాస్, కె. శ్రీమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




