calender_icon.png 5 February, 2026 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల భద్రత, రక్షణకు ప్రాధాన్యం

05-02-2026 12:16:33 AM

ఆదిలాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలు పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు, జిల్లా పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతనిస్తోందని  ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. బుధవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర పనుల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన గదిని మహిళా కానిస్టేబుల్‌చే రిబ్బన్ కట్ చేయించారు.

అదేవిధంగా సిబ్బంది విశ్రాంతికి ప్రత్యేకంగా మరొక విశ్రాంతి గదిని సైతం ఎస్పీ  ప్రారంభించారు. ఇచ్చో డ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించి రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలని, బాధితుల సమస్యల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ సిబ్బందిని కేటాయించి సమస్యల పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ బండారి రాజు, ఎస్‌ఐ రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.