దంత వైద్యులకు ప్రతిష్ఠాత్మక ఆవార్డు
డిప్యూటీ సీఎం, గవర్నర్ చేతుల మీదుగా..
డాకర్లు ప్రదీప్‌కుమార్, ప్రియాంకలకు పురస్కారం
ఖమ్మం, జూన్ 21 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్ వీడీఓస్ కాలనీలో ఉన్న శ్రీ శ్రీనివాసం డెంటల్ హాస్పిటల్ వైద్యులు డా. మొరిశెట్టి ప్రదీప్ కుమార్, డాక్టర్ ఎం. ప్రియాంకలకు అధునాతన దంత వైద్య సేవలలో విశిష్ట సేవలం దించినందుకు ప్రతిష్ఠాత్మకమైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ అడ్వాన్స్‌డ్ డెంటిస్ట్రీ అవార్డు లభించింది.
హైదరాబాద్‌లోనిని పార్క్ హయత్ హోటల్‌లో శనివారం నిర్వహించిన ఇండియన్ హెల్త్ సమ్మిట్ 2026 కార్యక్రమంలో ఈ అవార్డును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర గవర్న ర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్ నౌ నెట్‌వర్క్ నిర్వహించగా ప్ర ముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ బొల్లినేని భాస్క ర్ రావు, డీజీపీ సీవీ ఆనంద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రదీప్ కుమార్, డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ, అధునాతన దంత వైద్య సేవలను ఖ మ్మం జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. డిజి టల్ స్మైల్ డిజైనింగ్, డెంటల్ లేజర్ చికిత్సలు, డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ వంటి ఆధునిక సేవలను ఖమ్మంలోనే అందిస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే అత్యాధునిక ఇంట్రా లూమినా ప్రో కృత్రిమ మేథ సాంకేతికతను వినియోగిస్తూ, చికిత్స అనంతరం చిరు నవ్వు ఎలా ఉండబోతుందో ముందుగానే ఫొటోలు, వీడియోల రూపంలో చూపించే సదుపాయాన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.తమ సేవలను గుర్తించిన టైమ్స్ నౌ నెట్‌వర్క్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేయడం గర్వకారణమని, అధునాతన దంత వైద్య సేవల రంగంలో ఈ గుర్తింపు పొందిన తెలంగాణ జిల్లాల్లో తొలి డెంటల్ సెంటర్‌గా శ్రీ శ్రీనివాసం డెంటల్ హాస్పిటల్ నిలవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.






