22 June, 2026 | 2:14 AM

హైదరాబాద్‌లో మా కోక్లియర్ ఇంప్లాంట్ సదస్సు

22-06-2026 01:13 AM

అత్యాధునిక కోక్లియర్ ఇంప్లాంట్ టెక్నాలజీలు, క్లినికల్ సవాళ్లపై మేధోమథనం

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ‘వినికిడి లోపమున్న చిన్నారుల్లో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించి, వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధానాలపై ‘మాసికాన్ 2026’ వేదికగా నిపుణులు మేధోమథనం చేశారని ‘మా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్’ (ఎంఐఎస్‌హెచ్) వ్యవస్థాపకు లు అండ్ చైర్మన్ జి.సునీత కుమార్ తెలిపారు.

కోక్లియర్ ఇంప్లాంట్ రంగంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు’. మా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హి యరింగ్, మా ఈఎన్టీ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో, అలీ యావర్ జంగ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ (ఏవైజేఎన్‌ఐఎస్ హెచ్‌డీ) సహకారంతో శని, ఆదివారాల్లో  హైదరాబాద్‌లో ‘మాసికాన్ 2026’ సదస్సు నిర్వహిం చారు. ‘ఫ్రమ్ సైన్స్ టూ క్లినికల్ ప్రాక్టీస్’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) గుర్తింపు లభించింది.

ఈ కార్యక్రమంలో ముంబై  ఏవైజేఎన్‌ఐఎస్ హెచ్‌డీ డైరెక్టర్ డా క్టర్ సుమన్ కుమార్, మణిపాల్ యూనివర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ రాజశేఖర్, రోట రీ డిస్ట్రిక్ట్ 3150 మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్లు రవి వడ్లమాని, రమేష్ వంగల, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ సెక్రటరీ రోటేరియన్ శివాని తిబ్రే వాలా తదితర ప్రముఖు లు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో కోక్లియర్ ఇంప్లాంట్ అర్హత ప్రమాణాలు, శస్త్రచికిత్స విధానాలు, మ్యా పింగ్, నిపుణుల ఉపన్యాసాలు, చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా సుమారు 150 మంది ఈఎన్టీ వైద్యులు, ఆడియాలజిస్టులు, పరిశోధకులు, విద్యార్థులు  పాల్గొన్నారు.