15 August, 2026 | 5:58 PM

శ్రీచరణ కమ్యూనికేషన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 04:23 PM

శ్రీచరణ కమ్యూనికేషన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ యజమాని, మేనేజింగ్ డైరెక్టర్ బుస్సా శ్రీనివాస్ గుప్తా, శ్రీచరణ కమ్యూనికేషన్ బృంద సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, “స్వాతంత్య్రం గతం మనకు అందించిన కానుక మాత్రమే కాదు… భవిష్యత్తు కోసం మనపై ఉన్న గొప్ప బాధ్యత” అని పేర్కొన్నారు. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.