జ్ఞానం అందించే గురువులను పూజించాలి
* మనమంతా సన్మార్గంలో నడవాలి
* బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి
* ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
ముస్తాబాద్,జూలై 29( విజయక్రాంతి): బిజెపి ధార్మిక సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలోని వాసుదేవ ఆశ్రమం రుక్మిణి వేణుగోపాల ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గురుపౌర్ణమి సందర్భంగా రేపాక రామశర్మ దంపతులకు గురు పూజోత్సవం చేసిన అనంతరం ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర పుత్రా అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రాజు గురుస్వామిని పూజించి ఇరువురి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి మాట్లాడుతూ మనకు జ్ఞానాన్ని అందించిన గురువులకు, ఉపాధ్యాయులకు ఆధ్యాత్మిక గురువులకు భక్తితో కృతజ్ఞతలు తెలుపుతూ చెడు నుండి సన్మార్గంలో నడిపించే గురువులను మనమంతా ఎల్లవేళలా గౌరవించుకోవడం మన సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి,జిల్లా కౌన్సిల్ మెంబర్ మెరుగు అంజాగౌడ్ గంభీరావు పేట మండల అధ్యక్షుడు కోడె రమేష్, ప్రధాన కార్యదర్శిలు ఎదునూరి గోపి, బుచ్చెల్లి మహేశ్వరి, కోశాదికారి జిల్లెళ్ళ మల్లేష్, గూడెం ఉప సర్పంచ్ దగ్గు నవీన్, మల్లేష్ యాదవ్, మండలం ఉపాధ్యక్షులు మహేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.






