22 April, 2026 | 3:26 AM

ప్రణీత్‌ది ఆత్మహత్య కాదు- ప్రభుత్వ హత్యే

22-04-2026 02:08 AM
  1. కాలేజీ యజమాన్యం గుర్తింపును రద్దు చేయాలి
  2.   18 సంఘాల సమావేశంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్,ఏప్రిల్ 21(విజయక్రాంతి): ప్రభుత్వం ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో శ్రీ ఇందు ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రణత్ ది ఆత్మహత్య కాదని, ఇది ప్రభుత్వ హత్య అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,  ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. తక్షణమే కాలేజీ గుర్తింపును రద్దు చేయాలన్నారు.  ప్రణీత్ ఆత్మహత్య చేసుకోవడం చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని హితవు పలికారు.

ఈ మేరకు మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో 18 సంఘాల రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ మోడీ రాందేవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో  ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ గత 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 8 మంది విద్యార్థులు ఈ సమస్యపై ఆత్మహత్యకు పాల్పడ్డారని మండిపడ్డారన్నారు. గత 30 నెలల కాలంలో 88 సార్లు విద్యార్థులు ఉద్యమాలు చేశారన్నారు. కాలేజ్ యాజమాన్యాలు12 రోజులు రెండుసార్లు బంద్ జరిపారన్నారు.

అయిన ప్రభుత్వం దిగి రాలేదన్నారు. పైగా స్కీమును ఎత్తివేసే కుట్రలు చేస్తుందని విరుచుకుపడ్డారు. అడుగడుగున బీసీలకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో బీసీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడం న్యాయం కాదన్నారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ కులాల ఐక్యవేదిక రా ష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, ఈ సంఘాల నేతలు సి.  రాజేందర్, నిఖిల్ పటేల్, వెంకట్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.