ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి లో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు అన్నారు. సోమవారం కార్యాలయం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇంద్రవెల్లి మండలం డొంగర్ గావ్ గ్రామానికి చెందిన ఆడే ఆశ తనకి కుట్టు మిషన్ లోన్ మంజూరు కల్పించామని, ఆదిలాబాద్ మండలం పల్లి-బి గ్రామానికి చెందిన ఆత్రం గంగాధరి బాయి తన వ్యవసాయ క్షేత్రానికి బోర్ బావి మంజూరు కల్పించామని అర్జీ కోరారు.
వాంకిడి మండలం సోనాపూర్ గ్రామానికి చెందిన పంద్రం సురేష్ తమ గ్రామానికి రోడ్డు మరియు అంగన్వాడి భవనం మంజూరు కల్పించామని అర్జీ కోరారు. ఇచ్చోడా మండలం దుపర్ పేట్ గ్రామానికి చెందిన గంగామణి తనకి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించమని అర్జీ. బజార్హత్నూర్ మండలం భూతై గ్రామానికి చెందిన కలబాయ్ తనకి ట్రాక్టర్ మంజూరు కొరకు అర్జీ కల్పించామని దరఖాస్తు పెట్టారు,వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మం జూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధిం చిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






