25 May, 2026 | 6:57 PM

విద్యుత్ షాక్ తో గృహిణి మృతి

25-05-2026 06:05 PM

* విద్యుత్ తీగను "ఎలుక" కొరకడంతో.. బీరువాకు విద్యుత్ సరఫరా కావడంతో

పాపన్నపేట: విద్యుత్ షాక్ కు గురై వివాహిత మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ముద్దాపూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన పోలీసు పార్వతి (35) సోమవారం ఉదయం కూతురు సారీ పంక్షన్ ఉండడంతో బీరువాలో ఉన్న బట్టలు తీసుకునేందుకు వెళ్లగా బీరువాపై ఉన్న విద్యుత్ తీగలను ఎలుకలు కొరకడంతో బీరువాకు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్ కు గురై కేకలు వేసింది.

కుటుంబీకులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి హుటాహుటిన మెదక్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పాపన్నపేట పోలుసులకు సమాచారం ఇవ్వగ పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పంచనామా నిర్వహించి మృతురాలి భర్త రవి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.