సురక్షిత ప్రయాణమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి
ట్రాఫిక్ ఎస్సై శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వాహనదారులు భద్రత ప్రమాణాలను పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ వాహనదారులను కోరారు. సిరిసిల్లలో "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ట్రాఫిక్ ఎస్,ఐ, ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.(ఆర్రీవ్-అలైవ్) సురక్షితంగా గమ్యానికి చేరండి,అనే నినాదంతో ప్లెక్సీలు ప్రదర్శిస్తూ పాత బస్టాండ్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, ముఖ్య కూడళ్ళ నుండి ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్,ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెటు, సీటు బెల్టు ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.




