ప్రజల సౌలభ్యం కోసమే ప్రజాపాలన
- బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
- కొనసాగుతున్న ప్రజాపాలన ప్రణాళిక
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రజల సౌలభ్యం కోసమే ప్రజాపాలన ప్రణాళిక ప్రోగ్రామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం 23 వార్డులో ప్రజాపాలనా ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని 23వ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థను శుభ్రపరిచే పనులను చేపట్టామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
అలాగే 16వ వార్డులో కూడా డ్రైనేజ్ శుభ్రపరిచే పనులను ప్రారంభించి పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా 99 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు, 23వ వార్డు కౌన్సిలర్ జంగం కల్పన, 16వ వార్డు కౌన్సిలర్ మత్తమర్రి రాజమల్లు, మున్సిపల్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




