నిజాంసాగర్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
నిజాంసాగర్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, పారిశుద్ధ్య డ్రైవ్ వంటి పలు కార్యక్రమాలు గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో నిజాంసాగర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలు కావడమే ఈ 99 రోజుల ప్రణాళిక ప్రధాన లక్ష్యమని తెలిపారు. స్థానిక నాయకులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




