24 April, 2026 | 4:23 AM

కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ప్రతి గురువారం ప్రజాదర్బార్

24-04-2026 12:00 AM

కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ 

ఖమ్మం, ఏప్రిల్ 23(విజయక్రాంతి):  జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కమిటీ మొట్ట మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించనైనది. ఇటీవల అకాల మరణం పొందిన నగర కాంగ్రెస్ కమిటి మాజీ అధ్యక్షులు మహ్మద్ జావేద్ కు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేసారు.

ఈ సందర్భంగా నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఇకనుంచి ప్రతి గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలు అమలు తీరు ప్రతి గ్రామంలో ప్రతి గడపకు చేరవేసే కార్యక్రమం జిల్లా కార్యవర్గం తీసుకోవాలని, కార్యవర్గ కమిటీ సభ్యులు అందరూ క్రమశిక్షణతో జిల్లాలో పార్టీ బలోపేతం కొరకు కృషిచేయాలని కోరారు. అన్ని మండలాలలో మండల అధ్యక్షులతో కలిసి బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం, ఇతర కమిటీల ఏర్పాటు, రాబోవు రోజుల్లో రానున్న జెడ్ పి టి సి, ఎంపిటిసి ఎన్నికలకు సమాయత్తం కావాలని కోరారు.  సమావేశం నందు సభ్యులు పై విషయములపై చర్చించి, ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తూములూరి లక్ష్మీ నరసింహారావు, మలీదు హైమావతి, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, కాపా సుధాకర్, కళ్లెం వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శులు కిలారి అనిల్ కుమార్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, కంచర్ల వెంకట నర్సయ్య, రామసహాయం హరిత రెడ్డి, పులిబండ్ల చిట్టిబాబు, దొడ్డా పుల్లయ్య, బానోతు రామమూర్తి, కమటాల రేణుక, కొప్పుల ప్రభావతి రెడ్డి, మహమ్మద్  హఫీజుద్దీన్, పుచ్చకాయల సోమిరెడ్డి, గోవింద్ శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు పాల్గోన్నారు.