23 May, 2026 | 2:58 PM

Breaking News

పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి

23-05-2026 02:07 PM

బోథ్,మే 23(విజయక్రాంతి): సోనాల మండలంలో ని పుణ్యానాయక్ తాండ చింతల బోరి గ్రామాల మధ్యన ఉన్న వాగు పైన వంతెన నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వంతెన నిర్మించడంతోపాటు రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేస్తే దూర భారం తగ్గడంతో పాటు వ్యవసాయదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. పొలం బాట కార్యక్రమంలో రోడ్డు నిర్మాణం చేపట్టినట్లయితే వర్షాకాలం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.