23 May, 2026 | 2:53 PM

Breaking News

ఏఐసీసీ దృష్టిలో బెస్ట్ పీసీసీ తెలంగాణ   •   నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •  

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు

23-05-2026 02:04 PM

నిజాంసాగర్ మే 23( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జొన్న రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన  కొనుగోలు కేంద్రాన్ని అచ్చంపేట ప్రాథమిక సహకార సంఘ ఆధ్వర్యంలో శనివారం నాడు నిజాంసాగర్ మండలంలోని మంగళూరు గ్రామంలో  కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏ లే మల్లికార్జున్, సహకార సంఘ అధ్యక్షులు కయ్యం నరసింహారెడ్డి, ప్రారంభించారు. జొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు  సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజాపండరి, స్థానిక సర్పంచ్ రాజు, సహకార సంఘ సీఈవో సంగమేశ్వర్ గౌడ్, నాయకులు చాకలి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.