నాట్ల సమయంలో కరెంటు కోతలు
07-07-2026 12:38 AM
- సబ్ స్టేషన్ ఆపరేటర్‌ను నిర్బంధించిన రైతులు
- కామారెడ్డి జిల్లా ఆరేపల్లిలో నిరసన
కామారెడ్డి, జూలై 6 (విజయక్రాంతి): తరచుగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండటంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి గ్రామంలో సబ్ స్టేషన్ ఆపరేట్‌ను నిర్బంధఙంచి రైతులు నిరసన వ్యక్తం చేశారు. వరి నాట్లు వేస్తున్న సమయంలో విద్యుత్ కోతలు విధించడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. విద్యుత్ అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. మూడు రోజులుగా తరచుగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని చెప్పారు.
సబ్ స్టేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్‌ను గదిలో నిర్బంధించి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. వరి నాట్ల సమయంలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కరెంట్ సరఫరాలో కోతలు విధించమని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆపరేటర్‌ను విడిచి పెట్టారు.






