గొర్ల కాపరులకు లైసెన్స్‌తో కూడిన తుపాకులు ఇవ్వాలి
భీమదేవరపల్లి, జూలై 6 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో జరిగిన సమావేశంలోగొర్ల మేకల కాపరులకు ఆత్మ రక్షణ కోసం కర్ణాటక తరహాలో లైసెన్స్ తో కూడిన తుపాకులు ఇవ్వాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కిల్లి గోపాల్. ఉడుత రవీందర్ గార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈరోజు అమరవీరుల స్ఫూర్తి యాది యాత్ర మూడవ రోజు ముల్కనూరు మండల కేంద్రానికి చేరుకుంది. మండల కేంద్రంలో సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పుల రమేష్ అధ్యక్షతన ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గోపాల్ రవీందర్లు మాట్లాడుతూ గొర్ల మేకల పెంపకం దారులు తమ వృత్తి రక్షణ కోసం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రధానంగా దొంగలు మందులు పెట్టే సమయంలో గొర్ల కాపర్లపై దాడులు దౌర్జన్యాలు హత్యలు చేస్తూ గొర్రెలను ఎత్తుకుపోతున్నారని అడవులలో క్రూర మృగాలు. కుక్కలు గొర్లు మేకలను కాపర్లను రక్షించుకొనుటకు చనిపోయిమేకలు చనిపోయి ఆవేదన వ్యక్తం చేశారు.
దొంగల నుండి కూర మృగాల నుండి గొర్రెలు మేకలను కాపర్లను రక్షించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం గొర్ల కాపరులకు లైసెన్సు కూడిన ఇచ్చింది. ఈ ప్రభుత్వం కూడా అలా గొర్ల కాపరి రక్షణ కోసం లైసెన్స్ తో కూడిన గనులు గొర్ల కాపలాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గొర్ల కాపరుల సంఘం పోరాట ఫలితంగా తుమ్మ చెట్లు బంజరు భూములు. గొర్రెలు మేకలకు ఇన్సూరెన్స్ గొర్ల కాపరులకు ఎక్స్గ్రేషియో సొసైటీ ఎన్నికలు జరపాలని చదువుకున్న యువతీ యువకులకు 75 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని ఎన్నికలలో ఇచ్చిన ప్రకారం గొర్ల పంపిణీ 2 నగదు బదిలీతో గొర్ల కాపరుల అకౌంట్లో వేయాలని వారు డిమాండ్ చేశారు.
సంఘం ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ సీజన్ వారిగా గొర్లు వివిధ రోగాలకు మందులు గుడ్లు మేకలకు సరిపోయే విధంగా అందుబాటులో ఉంచాలని పశువైద్య పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో లో సంగం రాష్ట్ర నాయకులు బొల్లం అశోక్. కడెం లింగయ్య.. చల్ల మల్లయ్య సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి గంటే సమ్మయ్య జిల్లా డైరెక్టర్ జిల్లా ఉపాధ్యక్షులు బండారి నారాయణ జిల్లా కమిటీ సభ్యులు గండ్రకోటి కుమార్ మండల అధ్యక్షులు ఆదరి రవి . మడక ఐలయ్య మహేష్ తదితరులు పాల్గొన్నారు.






