సెలెక్ట్ అయిన 2,087 మంది నర్సింగ్ ఆఫీసర్లకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి
- వందలాది మంది నిరుద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టేట్ ముట్టడి
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): సెలెక్ట్ అయిన నర్సింగ్ ఆఫీసర్ లకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణ య్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య-ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయిన 2087 మం ది నర్సింగ్ ఆఫీసర్ లకు వెంటనే పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 1200 మంది నిరుద్యోగులు గురువారం కోఠిలోని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు.
రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి భారీ ఎత్తున గుంపులు గుంపులుగా తరలివచ్చారు. డైరెక్టర్ కార్యాలయ వద్దకు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా ఎంపీ ఆర్.కృష్ణయ్య బైటాయించిన నర్సింగ్ ఆఫీసర్ లను ఉద్దేశించి ప్రసంగిస్తూ సెలెక్ట్ అయిన వారికి వెంటనే పోస్టింగ్స్ ఇవ్వడానికి అధికారులతో మాట్లా డి తొందరగా వచ్చేటట్లు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఒకేసారి భారీ మొత్తంలో వైద్య ఆరో గ్య శాఖలో ఇప్పటి వరకు12వేల పోస్టులు భర్తీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహలను అభినందిందారు. అనేకసార్లు ఉద్యమాలు చేసినప్పటికీ 100 పోస్టు లు కూడా భర్తీ చేయలేదన్నారు.
ఈ ముట్టడి కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి, బీసీ ఐఖ్య వేదిక కుల సంఘాల అధ్యక్షులు జి. అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ రాందేవ్ మోడీ, ప్రీతం నిఖిల్ పటేల్ , రఘుపతి తదితరులు పాల్గున్నారు.
ఈ నెల 20లోగా పోస్టింగ్స్ ఇస్తాం ః డైరెక్టర్
ఎక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించి వెంటనే పోస్టులను భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ హామీ ఇచ్చారు. ఈ నెల 20లోగా పోస్టింగ్స్ ఇస్తామని ఆయన ప్రకటించారు.






