calender_icon.png 23 February, 2026 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు సుందరీకరణ పనులు ప్రారంభం

23-02-2026 12:24:14 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): నగరంలోని రేకుర్తి 19వ డివిజన్ లోని పెంటకమ్మ చెరువు సుందరికరణలో భాగంగా అమృత్ 2.2 పథకం క్రింద 1కోటి 90లక్షల రూపాయల నిధులతో  చెరువు సుందరికరణ పనులు ప్రారంభమయ్యాయి. చెరువు కట్ట పైనా సిసి రోడ్ సైడ్ వాల్స్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణం, చెరువు తూము నుండి వచ్చే మత్తడి నీరు పట్టా భూములకు రాకుండా డ్రైనేజ్ నిర్మించడానికి 19వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని మాధవి-కృష్ణ గౌడ్, 20వ డివిజన్ కార్పోరేటర్ పర్వతం మల్లేషం ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19వ 20వ డివిజన్ల ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదంగా వీక్షించడానికి మినీ ట్యాంక్ బాండ్ తరహాలో సుందరికరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు జెట్టి ప్రభాకర్, దూస కనుకయ్య, రేగుల శ్రీనివాస్, గరిగంటి మహేష్, గరిగంటి శ్రీనివాస్, పర్వతం తిరుపతి, నూనె కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.