12-02-2026 12:00:00 AM
ఓటు హక్కును వినియోగించుకున్న నేతలు
కరీంనగర్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నిక లు చిదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. కరీంనగర్ నగరపాలక సంస్థలో జిల్లా పరిషత్ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరగగా పోలీసులు లాఠీ చార్జీ చేయగా ఆరుగురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
పోలీసుల తీరును నిరసి స్తూ బీజేపీ నాయకులు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అలాగే 28వ డివిజన్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి కుర్ర తిరుపతిని అరెస్టు చేయడంపై మండిపడ్డ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అరెస్టును అడ్డుకుని అక్రమ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 49వ డివిజన్ లోని రాంనగర్ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ అభ్యర్థి, ప ద్మశ్రీ భర్త శ్రీనివాస్ రెడ్డి భర్త సెల్ ఫోనును గుంజుకుని బీఆర్‌ఎస్ అభ్యర్థితోపాటు కార్యకర్తలు పగలగొట్టడంతో అక్కడి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుడా చైర్మ న్ నరేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని నిలదీయ డం జరిగింది.
అలాగే 24వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇలాంటి చిదురు ముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్ల పరిధి లో 62.98 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 3,40,580 ఓటర్లలో 2,14,486 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
242 బూత్ లో జరిగిన సంఘటన లలో రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసిన ట్లు వైరల్ కావడాన్ని కవిషనర్ ప్రపుల్ దేశా య్ ఖండించారు. చొప్పదండిలో 14 వార్డులలో మొత్తం 13,916 ఓటర్లు ఉండగా 10,960 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 78.76 శాతం పోలింగ్ నమోదయింది. హుజూరాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా పోలింగ్ శా తం నమోదయింది. 30 వార్డులకుగాను 29 ,531 ఓటర్లు ఉండగా 26,060 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 81.47 శాతం పోలింగ్ నమోదయింది. జమ్మికంటలో 79.81 శాతం పోలింగ్ నమోదయింది.
మొత్తం 27,497 ఓట్లు పోలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సిరిసిల్లలో 39 వార్డుల పరిధిలో 77.57 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 81,959 ఓటర్లకుగాను 63,562 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేములవాడలో 28 వార్డులు ఉండగా మొత్తం ఓటర్లు 40,877కుగాను 77.99 శాతం పోలింగ్ నమోదయింది. 31,831 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లో కలిపి 77.70 శాతం పోలింగ్ నమోదయింది. జగిత్యాల జిలల్లాలో ధర్మపురి మున్సీపాలిటీలో 15 వార్డులకుగాను 77.16 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 14,035 ఓట్లకు 10,459 ఓట్లు పో లయ్యాయి. జగిత్యాల జిల్లాలో 50 వార్డులకుగాను 69.60 శాతం పోలింగ్ నమోద యింది. మొత్తం 94,800కు గాను 65,985 ఓట్లు పోలయ్యాయి. కోరుట్లలో 33 వార్డులకుగాను 69.47 శాతం పోలింగ్ నమోద యింది. ఇక్కడ 63,507 ఓట్లు ఉండగా 44, 116 ఓట్లు పోలయ్యాయి. మెట్పల్లిలో 26 వార్డులు ఉండగా 69.21 శాతం పోలింగ్ న మోదయింది.
మొత్తం 46.201 ఓట్లకుగాను 31,970 ఓట్లు పోలయ్యాయి. రాయికల్లో 12 వార్డులు ఉండగా 74.96 శాతం పోలింగ్ న మోదయింది. 13,084 ఓట్లకుగాను 9,808 ఓట్లు పోలయ్యాయి. జిల్లా మొత్తంగా 5 మున్సిపాలిటీల్లో కలిపి 70.13 శాతం పో లింగ్ నమోదయింది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 81.52 శాతం పో లింగ్ నమోదయింది. మొత్తం 13,716 మం ది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మున్సి పాలిటీలో 36 వార్డులు ఉండగా 43,789 మంది ఓటర్లకుగాను 32,201 మంది ఓట ర్లు 73.54 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంథని మున్సి పాలిటీలో 76.76 శాతం పోలింగ్ నమోదయింది. మొ త్తం 14,402 ఓట్లు ఉండగా 11,056 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.