12 June, 2026 | 1:59 AM

పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి

12-06-2026 12:50 AM

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో రూపొందుతున్న ‘చిరు158’ (వర్కింగ్ టైటిల్) చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో జరిగిన హై-ఎనర్జీ షెడ్యూల్‌ను పూర్తిచేశారు.

ఈ షెడ్యూల్లో చిరంజీవి, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాతి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. చిరు ఈ చిత్రంలో తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన మరోసారి ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తిక్ కన్నన్, ప్రొడక్షన్ డిజైన్‌గా అవినాశ్ కొల్లా, ఎడిటర్‌గా ఆంటోని ఎల్ రూబెన్ పనిచేస్తున్నారు. అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికలు, ఇతర ప్రధాన తారాగణం వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.