గూడూరుపాడులో రాజకీయ కక్షసాధింపులు చెల్లవు
మాజీ ఎమ్మెల్యే కందాళ
ఖమ్మం ఎడ్యుకేషన్ ఆగస్టు 21 (విజయక్రాంతి) :- గూడూరుపాడు గ్రామంలో ఈ నెల 16వ తేదీ రాత్రి బ్పై ప్రయాణిస్తున్న బీఆర్‌ఎస్ గ్రామ నాయకులు మర్తి రామారావు, బట్టు రామారావుపై గుర్తుతెలియని వ్యక్తులు వెనుక నుంచి వచ్చి భౌతిక దాడికి పాల్పడటం దారుణమని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఆయన గురువారం బాధితుల నివాసానికి వెళ్లి పరామర్శించారు. దాడికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు.
రాజకీయ కక్షసాధింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ భేదాభిప్రాయాలను హింసాత్మక ఘటనలకు దారితీయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలని సూచించారు.






