30 March, 2026 | 8:01 PM

పోగొట్టుకున్న 10 ఫోన్లు బాధితులకు అప్పగింత

30-03-2026 06:28 PM

పాపన్నపేట: ఇటీవల వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్ఐ సార శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న 10 ఫోన్లను  బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో 485 ఫోన్లు పోగొట్టుకోగా, ఇప్పటికి 92/44 శాతం 449 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించామని ఆయన తెలిపారు.