పెళ్లి కానుకగా ఎస్ఆర్ ఫౌండేషన్ వారి ఆర్థిక సాయం
30-03-2026 07:32 PM
దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలం సీతారాంపల్లి గ్రామంలో చెరుకు వెంకటేష్ వివాహ సందర్భంగా ఎస్ఆర్ ఫౌండేషన్ (తిమ్మయ్య సుభాష్ రెడ్డి) తరఫున రూ.5,000 నగదు కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నెల బాను శ్రీ సిద్ధరాములు, ఉప సర్పంచ్ జాలిగామ స్వామి, పంచాయితీ కార్యదర్శి సౌందర్య పాల్గొన్నారు. అలాగే పలకవర్గ సభ్యులు గంగిరెడ్డి రమేష్, వెన్నెల లక్ష్మణ్, జాలిగామ రాజు, పుట్టపోశయ్య, బైకర్ రవి, పుట్ట నరేష్, కరాబర్ రాజు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.




