30 March, 2026 | 9:18 PM

రోడ్డు భద్రతాను మెరుగు పరచడమే పోలీసుల లక్ష్మం

30-03-2026 07:47 PM

కంగ్టి,(విజయక్రాంతి): రోడ్డు భద్రతాను మెరుగుపరిచే లక్షంతో మండలంలో అరైవ్ అలైవ్, కార్యక్రమం కొనసాగుతుందని ఎస్ఐ దుర్గారెడ్డి అన్నారు. సోమవారం కంగ్టి మండలంలోని చాప్ట కే, తడ్కాల్ తదితర గ్రామాలలో వాహన దారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించాలని మద్యం సేవించి వాహనం నడపారాధన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివాజీ రావు, ఉపసర్పంచ్ మోహన్, పోలీస్ సిబ్బంది, యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.