తుంగతుర్తి సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా బికోజి
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షునిగా బాపన్ భాయ్ తండా గ్రామ సర్పంచ్ బికోజి నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శేషు కుమార్ ఆధ్వర్యంలో మండల సర్పంచుల ఫోరం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచ్ ల ఫోరం గౌరవాధ్యక్షులు గా కుంచాల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షునిగా కలకోట్ల మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా మొరం సంధ్యా భిక్షం, కార్యదర్శిగా మల్లెపాక సాయిబాబా, కోశాధికారిగా రమేష్,లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బికోజి మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడుగా ఎన్నికైనందున బాధ్యత మరింత పెరిగిందని, అందరి సహకారంతో సర్పంచుల సమస్యల పరిష్కారానికి, మండల పరిధిలోని గ్రామాలు అభివృద్ధి పథంలో నడిపించడానికి స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్, డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ ఎన్నిక కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామ సర్పంచ్ లు పాల్గొని శాలువాతో ఘనంగా సన్మానించారు.




