19 August, 2026 | 2:33 AM

పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

19-08-2026 12:10 AM

నూతన కార్యవర్గానికి ఎస్పీ శుభాకాంక్షలు

సిరిసిల్ల, ఆగస్ట్ 18, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఎన్నికలను ఎన్నికల నోడల్ అధికారి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడు ఆర్‌ఐ అడ్మిన్ పర్యవేక్షణలో నిర్వహించారు.

ఎస్పీ మహేష్ బి గితే ఆదేశాల మేరకు జరిగిన ఎన్నికలను పరిశీలించిన ఎస్పీ, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. అధ్యక్షుడిగా వేములవాడ టౌన్ కానిస్టేబుల్ ఎస్. గోపాల్, ఉపాధ్యక్షులుగా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి. రవి, వేములవాడ రూరల్ ఎస్‌ఐ వెంకట్రాజం, కార్యదర్శిగా సిరిసిల్ల రూరల్ సీఐ కె. నాగేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా గంభీరావుపేట కానిస్టేబుల్ డి. శ్రీనాథ్రాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఎం. ప్రకాష్, కోశాధికారిగా జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది ఏ. వేణు ఎన్నికయ్యారు.ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ముస్తాబాద్ కానిస్టేబుల్ కె. గోపాల్, ఎల్లారెడ్డిపేట కానిస్టేబుల్ ఏ. శ్రీనివాస్, బోయినపల్లి కానిస్టేబుల్ ఏ. సుధాకర్, తంగళ్లపల్లి హెడ్ కానిస్టేబుల్ పద్మ, ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుళ్లు గడ్డం మహేష్, బి. తిరుపతి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే శుభాకాంక్షలు తెలిపారు.