7 April, 2026 | 1:34 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

పోలీసుల తనిఖీలు

09-10-2025 12:42 AM

మేడ్చల్, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలోని కేఎల్‌ఆర్ వెంచర్ లో శివాజీ విగ్రహం వద్ద పోలీసులు బుధవారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఏసీపీ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో వాహనాలు, పరిసరాలను తనిఖీ చేశారు. కేఎల్‌ఆర్ లో దుకాణాలు, హోటల్ ముందు అడ్డగోలుగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా పార్కింగ్ చేయొద్దని వాహనదారులకు పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఐ కిరణ్, ఎస్త్స్ర శ్రీనివాస్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జయశంకర్ విగ్రహం వద్ద రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు చేయడమే గాక రోడ్డు మీద వాహనాలు పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. జయశంకర్ విగ్రహం వద్ద కూడా ఇష్టానుసారంగా పార్కింగ్ చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.