నాలుగేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యం
ఫోక్సో కేసు నమోదు
అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో(Aswaraopeta) ఓ నాలుగేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబందించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మున్సిపాలిటి పరిధిలోని ఓ వార్డుకు చెందిన ముక్కుపచ్చలారని చిన్నారిని అదే ఇంటికి ఎదురుగా ఉండే 14 ఏళ్ల బాలుడు ఆడిస్తానని బుధవారం ఇంట్లోకి తీసుకెళ్లాడు.
చిన్నారి ఇంటికి వచ్చాక నలతగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆరా తీశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా హతాసులయ్యారు. ఘటనపై చిన్నారి తాత బాలుడి ఇంటికి వెళ్లి నిలదీయంతో ఎదురుగా దాడికి దిగారు. దీంతో విషయం పూర్తిగా వెలుగులోకి రావటంతో చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిపై గురువారం ఫోక్సో కేసు(POCSO Act) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు




