తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!
18-03-2026 10:02 AM
- అనుమానస్పద స్థితిలో తండ్రి కూతుళ్ళ సజీవ దహనం
- అల్లుడు పైన అనుమానం
మహబూబాబాద్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా(Hanumakonda District) కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప కాలనీలో(Rajiv Gruhakalpa Colony) బుధవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో తండ్రి కూతుర్లు సజీవ దహనం అయ్యారు. ఇంట్లో చెలరేగిన మంటల్లో తండ్రి రాజశేఖర్ కుమార్తె రాజశ్రీ సజీవ దహనం అయ్యారు. అయితే కుటుంబ కలహాల వల్ల రాజశేఖర్ అల్లుడు ప్రవీణ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




